Approved under Sections 12A & 80G of the Income Tax Act
"Empowering our vision with their expertise. We are proud to have such distinguished individuals as our Honorary Members."
"సమాజ సేవలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తూ, విస్సాప్రగడ శ్రీరామ మూర్తి గారు మరియు అమూల్య సీత మనోహరి గారు మన ట్రస్ట్‌కు తమ అమూల్యమైన మద్దతును అందించారు. వారు గౌరవ సభ్యులుగా చేరడం ద్వారా మా సేవా లక్ష్యాలకు మరింత బలం చేకూరింది. నిస్వార్థ సేవే పరమావధిగా సాగుతున్న మా ప్రయాణంలో ఇటువంటి దాతల ప్రోత్సాహం మాకు ఎంతో అమూల్యమైనది. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
"The Raja Poshaka membership is a tribute to those visionary individuals who believe in making a long-lasting difference. Their extraordinary support acts as the backbone of our trust, enabling us to reach thousands in need. We are eternally grateful to our Raja Poshaka members for their selfless contribution to humanity."
హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి సునీత మరియు శ్రీ వేణుగోపాల్ దంపతులు మన శారదామృత సేవ ట్రస్ట్ అభివృద్ధిలో భాగస్వాములవుతూ, అత్యున్నతమైన 'రాజపోషక' (Raja Poshaka) మెంబర్‌షిప్‌ను స్వీకరించారు.
సమాజ సేవ పట్ల వారికన్న మక్కువ, మన ట్రస్ట్ ఆశయాల పట్ల వారికన్న నమ్మకం మాకెంతో గర్వకారణం. సేవ అనేది ప్రచారం కోసం కాక, ఆత్మతృప్తి కోసం చేసేదని నమ్మి, తమ వివరాలను గోప్యంగా ఉంచాలని వారు కోరారు. వారి కోరికను గౌరవిస్తూనే, వారి ఈ నిశబ్ద దాతృత్వం మరెంతో మందికి స్ఫూర్తిదాయకం కావాలని మేము ఆశిస్తున్నాము.
"చేసే సేవలో స్వార్థం ఉండకూడదు, ఇచ్చే దానంలో ప్రచారం ఉండకూడదు." వారూ చూపిన ఈ మార్గంలోనే మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. మీ చిన్న సహాయం కూడా ఎందరో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
శారదామృత సేవా ట్రస్ట్ తరపున సునీత-వేణుగోపాల్ దంపతులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు.