Approved under Sections 12A & 80G of the Income Tax Act
While education is a powerful tool, self-confidence is the strength to use it effectively. In today’s world, many young women remain held back by fear and a lack of awareness despite their immense talent. Through the "Vidyaardhi Nestama!" initiative, Saradamrutha Seva Trust conducts awareness sessions in women's colleges to build self-esteem. We aim to nurture leadership qualities and guide them to face societal challenges with courage and resilience.
Empowering a woman means empowering a whole family and, ultimately, the nation. It is believed that supporting a woman’s growth brings prosperity and balance to society.
"You are not weak, you are powerful.. You are the foundation of social change! Are you ready, Vidyaardhi Nestama!"
"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మహిళా సాధికారత అంటే కేవలం హక్కులు కల్పించడం మాత్రమే కాదు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి స్వశక్తితో ఎదిగేలా ప్రోత్సహించడం.
విద్య ఒక ఆయుధమైతే, ఆత్మవిశ్వాసం ఆ ఆయుధాన్ని వాడే శక్తి. నేటి సమాజంలో ఎంతోమంది విద్యార్థినులు ప్రతిభ ఉన్నప్పటికీ, భయం మరియు అవగాహన లోపంతో వెనుకబడిపోతున్నారు. శారదామృత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో "విద్యార్థి నేస్తమా!" అనే కార్యక్రమం ద్వారా మహిళా కళాశాలల్లో విద్యార్థినులకు ఆత్మస్థైర్యం పెంపొందించే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. వారిలో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను వెలికితీస్తూ, సామాజిక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా మేము మార్గదర్శనం చేస్తున్నాము.
మహిళా సాధికారత ప్రాముఖ్యత
ఒక మహిళా సాధికారత సాధిస్తే, అది ఒక కుటుంబం మరియు దేశం యొక్క పురోభివృద్ధికి బాటలు వేస్తుంది. మహిళలకు అండగా నిలవడం అంటే సమాజంలో సమతుల్యతను మరియు సౌభాగ్యాన్ని పెంపొందించడమే అని మన పెద్దలు చెబుతారు.
"అబల కాదు నువ్వు సబలవు.. సమాజ మార్పుకు నువ్వే పునాదివి! సిద్ధమా విద్యార్థి నేస్తమా!"
మహిళా సాధికారత కోసం సహకరించండి / Support Women Empowerment